Total Pageviews

Friday, July 19, 2013

మధుమేహ వ్యాధికి ఎండోబారియర్‌తో చెక్: బ్రిటన్ శాస్త్రవేత్తలు



FILE
చిన్నపిల్లల నుంచి వృద్ధులను సైతం వణికిస్తున్న మధుమేహ వ్యాధిని అరికట్టేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు. దీనిని ఎండోబారియర్ అంటారని, దీనికి నోటి ద్వారా ఆంత్రమూలంలోకి ప్రవేశపట్టవచ్చునని తెలిసింది. దీంతో కొన్ని వారాల్లోనే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

అచ్చం చర్మం (సాసేజ్ స్కిన్)లాగే ఉంటుందని, ఈ గొట్టాన్ని సన్నని ప్లాస్టిక్‌తో తయారుచేశామని చెప్పారు. ఈ గొట్టాన్ని నోటి ద్వారా జీర్ణాశయం తర్వాతి భాగమైన ఆంత్రమూలంలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మత్తుమందు ఇచ్చి గంటలో పూర్తి చేస్తారని డైలీమెయిల్ తెలింది. 

ఇది ఆంత్రమూలం గోడలకు అతుక్కొని ఉండి జీర్ణమైన ఆహారాన్ని తక్కువగా పీల్చుకునే విధంగా చేస్తాయని, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు అన్నారు. ఎండోబారియర్‌ను వాడిన 72 శాతం మందిలో మధుమేహం పూర్తిగా తగ్గిపోయిందని వారు అంటున్నారు.
సంబంధిత సమాచారం

నిమ్మరసాన్ని పెరుగులో కలిపి స్నానం చేయండి... మెరిసిపోతారు



నిమ్మకాయ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదూ! రుచికి పుల్లగా ఉన్నా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. మన శరీరానికి ఒక రోజు మొత్తానికి కావాల్సిన సి-విటమిన్‌ను నిమ్మ అందిస్తుంది. నిమ్మ చేసే మేలు ఏమిటో కాస్త తెలుసుకుందామా...!!

నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది. 

అధిక బరువుతో బాదపడేవాళ్లు పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది. 

నిమ్మరసం తాగినా...నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా...చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.

మీకీ విషయం తెలుసా.. నిరాహారదీక్ష విరమించేటప్పుడు కూడా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. ఎందుకంటే ఖాళీకడుపులో గ్యాస్‌ చేరుకుని ఒక్కసారిగా ఏదైనా ఆహారపదార్థం తిన్నా...వెంటనే వాంతి అయిపోతుంది. ఒక్క నిమ్మరసం మాత్రమే శరీరం హరాయించుకుంటుంది. 

తల స్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో స్నానంచేస్తే కురులు నల్లగా మెరుస్తాయి.

ముల్తానామట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.

నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖంమీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది.

కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.

ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.

Thursday, July 18, 2013

చక్కెర వ్యాధి గ్రస్తులకు మేలు చేసే బ్లాక్‌ టీ!

చక్కెర వ్యాధి గ్రస్తులకు మేలు చేసే బ్లాక్‌ టీ!

మూలవ్యాధికి గరిక రసంతో విరుగుడు

మూలవ్యాధికి గరిక రసంతో విరుగుడు

Cashew Nuts, Paralysis, Body, Health, Magnesium | Foods | Leafy Greens | Beans | జీడిపప్పుతో పక్షవాతం దూరం చేసుకోండి..!!

Cashew Nuts, Paralysis, Body, Health, Magnesium | Foods | Leafy Greens | Beans | జీడిపప్పుతో పక్షవాతం దూరం చేసుకోండి..!!

Pudina | Headache | Health | తలనొప్పికి పుదీనా ఆకులతో ముద్ద

Pudina | Headache | Health | తలనొప్పికి పుదీనా ఆకులతో ముద్ద

Diabetes | Ayurvedam | Treatment | Stevia | Leaves | Sugar | Insulin | Blood pressure | Hypertension | tooth | Gas | Burning | Heart disease | Skin di | మధుమేహాన్ని పారద్రోలేందుకు స్టీవియా

Diabetes | Ayurvedam | Treatment | Stevia | Leaves | Sugar | Insulin | Blood pressure | Hypertension | tooth | Gas | Burning | Heart disease | Skin di | మధుమేహాన్ని పారద్రోలేందుకు స్టీవియా