కంప్లైంట్ చేసే ఒక కంప్లైంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అది ఏంటంటే
ధ్యానం నాకు కుదరని లేదు అని అంటుంటారు కదా ఎందుకు కుదరట్లేదు అసలు దీని వెనక మనం
చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం మన మొత్తం ధ్యాన ప్రపంచంలో
చాలా మంది 30 ఇయర్స్ ఇండస్ట్రీ 20 ఇయర్స్ ఇండస్ట్రీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్న
అనే వాళ్ళు కూడా అసలు ధ్యానం సరిగ్గా కుదరట్లేదు అనేసి చాలా
ఎక్కువగా వినిపించే కంప్లైంట్ అయితే మనందరికీ తెలుసు మనందరం
కూడా మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అని తెలుసు యు క్రియేట్
యువర్ ఓన్ రియాలిటీ బుద్ధుడు ఇదే చెప్పాడు అన్నమాట నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు
అయితే ఈ వాస్తవాన్ని మరి మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం అంటే మనం మాట్లాడే మాటల
ద్వారా మరి మనం ఏం మాట్లాడుతున్నాం 10 నిమిషాల ధ్యానం
చేసి మిగిలిన 20 23 24 గంటల్లో ఒక గంట ధ్యానం చేశారు అనుకుందాం మిగిలిన 23 గంటలు
కూడా నేను ఈరోజు పొద్దున గంట ధ్యానం చేస్తే అండి ఒక్క నిమిషమే ధ్యానం
కుదిరింది నాకు అసలు ధ్యానం నేను కరెక్ట్ గా చేస్తున్నానో లేదో అసలు నాకు వస్తదో
రాదో నేను చేసే విధానం సరైన విధానం కాదో ఏమో అని ఒక్క 10 నిమిషాల ధ్యానంకి 100
మాటలు మాట్లాడతాం ఆ 100 లో 99 కూడా ధ్యానం కుదరకుండా ఉండడానికి కావాల్సిన మాటలే మనము
నోటిలోని మాట నుదిటి మీద రాత అని మనందరికీ తెలుసు కానీ మనం మాట్లాడే మాట మాత్రం నాకు
ధ్యానం కుదరదు నా వల్ల కావడం లేదు నేను అసలు ధ్యానం శ్వాసను సరిగ్గా
గమనిస్తున్నానో లేదో గమనించిన గాని నాకే కుదరట్లేదేమో అని ఎన్ని మాటలు మాట్లాడుతూ
ఉంటాం మళ్ళీ మనకు తెలుసు అన్ని విషయాలు తెలుసు మనం ధ్యానంలో అలాగే కూర్చొని
ఉన్నట్లయితే మనకు ధ్యానం బాగా కుదురుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ధ్యానం
మనకు కుదరలేదు అంటే మనం ఒక పని చేయలేదు అని అర్థం అదేంటి చెప్పనా
మన ధ్యాస శ్వాసపై పెట్టలేదని అర్థం శ్వాసని గమనించిన ఎవ్వరికైనా ధ్యానం
కుదరకుండా ఉండడం అనేది అసలు జరగదు మనము వస్తున్న మనము ఇంతకుముందు ఈ వీడియోస్ కి
ముందు కూడా ఒకటి నేను వీడియో చేశా ధ్యానం చేస్తున్నామా ఆలోచనలో కొట్టుకుపోతున్నామా
అని అంటే మనకు ఒక ఆలోచనలో ఒక ఆలోచన వచ్చిందనుకోండి దానికి సంబంధించి చిరంజీవి
స్టాలిన్ మూవీ లో చెప్తారు కదా ఇంకో ఇంకో ఇంకో మూడు ఆలోచనలు వస్తాయి ఈ మూడు
ఆలోచనలకు ఇంకొక మూడు లేకుంటే 10 కూడా వస్తాయి అక్కడ ఉన్న మూడే ఇక్కడ 10 కూడా
వస్తాయి మళ్ళీ వాటికి ఇంకొన్ని ఆలోచనలు నేను స్కూల్ కి వెళ్ళిన విషయం ఒకటి
గుర్తొస్తే మా నాన్న కొనిచ్చిన స్కూల్ బ్యాగు వాటర్ వాటర్ బాటిల్ నాకు చదువు
చెప్పిన టీచర్లు వాళ్ళు నన్ను తిట్టిన తిట్లు కొట్టిన కొట్లు అదే విధంగా నన్ను
మెచ్చుకున్నప్పుడు నేను పాట పాడితే వచ్చిన ప్రైస్ ఇవన్నీ కూడా ఒక్క ఆలోచనే కారణమైంది
దానికి ఇన్ని ఇన్ని పిల్లలు పుట్టాయి ఆ పిల్ల ఆలోచనలు ఎన్ని పుడతాయి వాటిలో పడి
మనం గంట సేపు కాదు 10 గంటలు కూడా ఇంత మామూలుగా అయితే మనం కళ్ళు తెరుచుకొని
ఆలోచిస్తాం ధ్యానంలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తాం మిగిలిందంతా సేమ్ టు సేమ్ అలా
కూర్చొని ఆలోచిస్తూనే ఉంటాం ఆలోచిస్తూనే ఉంటాం అంటే కానీ పత్రి సార్ ఏం చెప్పారు
ఇక్కడే మనం ధ్యానాన్ని సరిగా అర్థం చేసుకోండి సరిగా అర్థం చేసుకోండి అని
అంటుంటారు కదా ఏం అర్థం చేసుకోవాలి ధ్యానాన్ని అంటే మనకి మూడే మూడు విషయాలు
ఉంటాయి అదేంటంటే ఫస్ట్ శ్వాస మీద ధ్యాస తర్వాత పత్రి సార్ ఆ గైడెన్ మెడిటేషన్
వెంటనే ఉంటది ఆలోచనలను
ఏం చేయమన్నాడు
కట్ కట్ చేయాలి ఓకే మనకు 100 ఆలోచనలు 1000 ఆలోచనలు రావచ్చు గాక వాటిని మొదటి ఆలోచన
దగ్గరే కట్ చేయాలి మళ్ళీ వస్తది ఆలోచన మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ మళ్ళీ వస్తది
మళ్ళీ మళ్ళీ కట్ చేయాలి ఎంతసేపటికి ఇప్పుడు నేను కళ్ళు మూసుకోగానే నాకు
ధ్యానం కుదురుతదో లేదో అని మొదటి ఆలోచన వచ్చింది అనుకోండి కచ్చితంగా కుదురుతది ఏం
చేయాలి అప్పుడు మరి కుదురుతది కుదురుతది అని కూడదు శ్వాసని గమనించాలి కొంతమంది
ఇక్కడి నుంచి ఈ ఈ బ్రూ మధ్యం వరకే గమనించగలరు సో అక్కడికే గమనించవచ్చు
కొంతమంది హృదయం వరకు గమనించగలరు సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గమనించవచ్చు కొంతమంది
ఏమో నాభి వరకు గమనించగలరు కాబట్టి ఇక్కడి నుంచి నాభి వరకు గమనించవచ్చు ఇక్కడ ఎక్కడ
వరకు గమనిస్తున్నారు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎండింగ్ ఇవన్నీ కాదు మనం
శ్వాసతో ఉన్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యం ధ్యానంలో శ్వాసతో ఉన్నప్పుడు ఒక
గంట సేపు ధ్యానంలో గంట సేపు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి మనం కట్ చేస్తూ కట్
చేస్తూ కట్ చేస్తూ ఉండగా ఉండగా రెండో గంట మొదలైనప్పుడు కచ్చితంగా ఆలోచించడానికి
ఇంకొక ఆలోచన కూడా రాదు ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎన్ని సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను
అన్నమాట కాసేపటికి ఇంకా నిజం చెప్పాలంటే మన శ్వాసని సరిగా గమనిస్తే 10 నిమిషాలు
చాలా ఎక్కువ మనసు శూన్యం అయిపోవడానికి ప్రతి శ్వాసని గమనించాలి ప్రతి శ్వాసని
గమనించాలి మనము చాలా అఫర్మేషన్స్ రాసుకుంటాం సంకల్ప శక్తి బుక్ చదువుతాము
ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తాము చాలా చేస్తాము అన్నిటిని ఆకర్షించడానికి కానీ
ధ్యానం చేస్తే అవన్నీ వస్తాయని మనకు తెలుసు మళ్ళీ అయితే ఇక నుంచి మనం ఒక
అఫర్మేషన్ రాసుకోవాలి ద మోస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్ అదేంటంటే
[సంగీతం]
సో ఇదే ఆ మోస్ట్ పవర్ఫుల్ ధ్యానంకు సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్
అన్నమాట నేను ప్రతి శ్వాసను గమనిస్తున్నాను మనకు ఏం కావాలి ధ్యానం
చేసేటప్పుడు శ్వాసను గమనించాలి మనము లోపల మాట్లాడుకుంటూ ఉంటాం కదా అవి పనులు చేస్తూ
చదువుకుంటూ మనం ఏం చేస్తున్నా గాని 24 గంటలు మనం పని చేస్తామో లేదో గాని ఒకటి
పని చేస్తుంటది అదే మన లోపల ఉన్నోడు వాడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు 100 మందితో
ఒకేసారి మాట్లాడగల కెపాసిటీ అన్నమాట సో ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తిని మనందరం పత్రి
సార్ ఏం చెప్పారు ధ్యాస ద్వారా
సృష్టి సో మనం ఇప్పుడు మనం ధ్యాసను ఎక్కడ పెడుతున్నాం అంటే ఏది ధ్యానం
చేస్తున్నప్పుడు కాదు ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం లోపల
మాట్లాడుతున్న వాడు ఏం చేయాలంటే ఇకపై మాట మార్చాలి నాకు ధ్యానం కుదరట్లేదు
కుదరట్లేదు అందరికీ ఇంతేనా నాకు ఒక్కదానికే ఇంతేనా ఇలా కాకుండా
మాట్లాడుతున్న వాటికి కొంచెం ఎరుకను పెంచుకొని గుర్తొచ్చిన ప్రతిసారి నేను
ఇకపై ప్రతి శ్వాసను గమనిస్తున్నాను మళ్ళీ అనుకోండి నేను ప్రతి శ్వాసని గమనించగలను
నేను ప్రతి శ్వాసను గమనిస్తున్నందుకు కృతజ్ఞతలు మన లోపల మాట్లాడుతున్న విషయము
మనకు తెలియకుండా జరిగిపోద్ది కానీ ఒక్కొక్కసారి గుర్తొస్తది నేను ఏంటి
అనవసరంగా లోపల మాట్లాడుతున్నాను అని సో ఈసారి ఏదేదో మాట్లాడుకోకుండా శ్వాస
గురించి ధ్యానం గురించి మాట్లాడినప్పుడు కచ్చితంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఓకే వీడు
ఇంతగా అడుగుతున్నాడు అంటే వీడికి ఇదే కావాలేమో అని చెప్పి మన మైండ్ ఏదైనా
సృష్టించగలదు కదా సో ఇకపై ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతి శ్వాసన గమనించగల
కెపాసిటీ మనకు వస్తుంది ఒక్క రోజులో ఈ రోజు క్లాస్ ని రేపటికల్లా ఇది అవుతది అని
అనుకోవద్దు ఎప్పుడూ కూడా ఈ ధ్యాన శాస్త్రమే ఎప్పుడూ కూడా నెవర్ ఎండింగ్
అన్నమాట మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనం ఎక్స్పర్ట్ అయిపోతుంటాం కాబట్టి మనం
ఎప్పుడూ ఈ అఫర్మేషన్ మనం నాకు కోటి ఉన్నందుకు కృతజ్ఞతలు నాకు అది ఇది కాకుండా
ఈ ఒక్కటి వస్తే అన్ని వస్తాయి కాబట్టి ఈ అఫర్మేషన్ ని మనం ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ
ధ్యానం చేస్తున్నప్పుడు ఇది అనుకోవద్దు ధ్యానం చేస్తున్నప్పుడు అసలు ఏమి చేయొద్దు
చేయాల్సిందల్లా ఆలోచనలు కట్ చేయడము శ్వాస మీద ధ్యాస ఈ విధంగా ధ్యానం చేస్తే మనకు
ధ్యానం కుదురుతుంది అంతేగాని మాటకు ముందు ఒక ధ్యానం కుదరదు మాటకు తర్వాత ఒకసారి
ధ్యానం కుదరదు అని అసలు అనుకోవద్దు వాటి ద్వారా నిజంగానే ధ్యానం కుదరదు ధ్యానం
కుదరదు బదులు ఆ మాటకు బదులు మాట మార్చాలి కదా ప్రతి శ్వాసను గమనిస్తున్నాను మనకి
నాలుగో పందాల పుస్తకంలో శక్తి మేరకు ప్రయత్నించాలి అని ఉంటుంది కదా శక్తి
మేరకు పని చేయండి మన శక్తి ఉన్నంతవరకు ఎరుక
ఉన్నంతవరకు మన మాటను షిఫ్ట్ చేసి ఈ మాటను ఉపయోగించాలి కొత్త ఒప్పందం చేసుకోవాలి మాట
ధ్యానం కుదరదు బదులు దాన్ని మార్చేసి కొత్త మాటను పెట్టాలి మనము మన మైండ్ లో ఆ
మాటే నేను ప్రతి శ్వాసను గమనిస్తున్నాను ఓకే ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఉంది రెండవది
అదేంటంటే
అనుభవాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు అండి నాకు ఒకరు చెప్తున్నారు ఒకరు కాల్ చేశారు
కాల్ చేసినప్పుడు అనుభవాలు నేను ధ్యానంలో కూర్చోగానే నాకు ఒక జర్క్ వెన్నుపాము
నుంచి అట జర్క్ వచ్చిందట సో నేను అది అలాగే అనుభవాల వెంట మనం పరిగెత్తొద్దు మనం
చేయాల్సింది ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టడం అని చెప్పా అయితే లేదండి నాకు
జరుకు వస్తుంది అనింది నేను మళ్ళీ రిపీట్ చేశా వాటి వెంట పడకూడదు మనం మనం ధ్యాన
సాధన కరెక్ట్ గా ఉండాలి ఈ జరుకు రావడం కాదండి మీరు ఇంకా ధ్యానం చేస్తుంటే ఇంకా
కొన్ని అనుభవాలు కూడా వస్తాయి అనుభవాల మీద మనం ఫోకస్ పెట్టకూడదు అన్న ఆమె మళ్ళీ నాకు
జర్క్ వస్తుందండి అని మళ్ళీ స్టార్ట్ చేసింది
అంటే మనం ఎంతసేపు కూడా నాకు ధ్యానంలో కూర్చోగానే అనుభవాలు రాగానే నాకు ఇలా
ఎందుకైంది అలా ఎందుకైంది నాకు బాడీ అంతా ఎందుకు వాటి వెనక సైన్స్ ఉంది అలా జరగడం
మనకి అదంతా మెడిటేషన్ లో ఒక ప్రాసెస్ అలా వస్తే ఏమైంది సో వాట్ నెక్స్ట్ కి
వెళ్ళాలి కదా నెక్స్ట్ కి వెళ్ళడం అంటే ఏదో కాదు మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస
పెట్టడమే కాబట్టి అనుభవాల మీద ఫోకస్ వద్దు మన మాటల్ని షిఫ్ట్ చేయాలి మనం చేయాల్సింది
ఆలోచనలను కట్ చేయడము మన మాటల్ని మార్చడము ఫైనల్ గా శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళకి
మాత్రమే ధ్యానం కుదురుతుంది మనకు ధ్యానం కుదరలేదు అంటే సింపుల్ డెఫినిషన్ మనం
శ్వాసని గమనించలేదని అర్థం అంతకు మించిన వేరే కారణం ఏమీ లేనే లేదు శ్వాస మీద ధ్యాస
పెడితే ఐదు నిమిషాలు ఇంకా చెప్పాలంటే మహా అంటే 10 నిమిషాలు ఇంకా కొత్త వాళ్ళకైతే 20
నిమిషాల్లో కచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టిన వారికి కచ్చితంగా ఈ మనము ఈ శరీరం
మాయమైపోయిన ఫీలింగ్ కచ్చితంగా తేలిక అయిపోయిన ఫీలింగ్ ఎంతో ప్రశాంతతను పొందిన
ఒక అనుభవం ఖచ్చితంగా వస్తుంది ఈ అనుభవాల వెంట పోవద్దు మనం చేయాల్సింది శ్వాస మీద
ధ్యాస పెట్టడం ఇంకెప్పుడూ కూడా నాకు ధ్యానం కుదరట్లేదు అనే మాటను మనం వాడకూడదు
మనం ఏం మాట్లాడతామో అదే మనకు జరుగుతుంది మనం ఏం ఊహిస్తామో అదే జరుగుతుంది మనం మనతో
కాదు పక్క పక్కన మెడిటేటర్ దొరికితే వాడు దొరికేసాడు కదా అని చెప్పి నాకేంటో ధ్యానం
కుదరట్లేదు 10 రోజులు అవుతుంది నేను ధ్యానం కుదరక అంటే ఈ రోజే కాదు 10 రోజుల
నుంచి కూడా ధ్యానం కుదరట్లా ఇకపై కూడా ఏం కుదురుతదో నేను ఇన్ని రోజుల నుంచి చేశాను
కానీ ఏ రిజల్ట్ లేదు ఆ ఇంకోటి రిజల్ట్ మీద ఫోకస్ మనం ఒక లక్ష్యం పెట్టుకొని ధ్యానం
చేస్తుంటాం అంటే లక్ష్యం కోసం ధ్యానం ధ్యానం ధ్యానం కోసం మాత్రమే ఎటువంటి
లక్ష్యాలు కాదు ధ్యానం సరిగ్గా కుదిరితే పెట్టుకొని చిన్నప్పటి చిన్నప్పుడు
పెట్టుకొని మనం మర్చిపోయిన లక్ష్యాలు కూడా నెరవేరుతాయి కాబట్టి లక్ష్యం కోసం ధ్యానం
చేయడం కోసం ధ్యానం చేయడం కాదు ధ్యానం ధ్యానం కోసమే శ్వాస మీద ధ్యాస సరిగా
ఉంచాలి అప్పుడు శ్వాస మీద ధ్యాస సరిగా ఉంటే మిగిలినవన్నీ సరిగానే ఉంటాయి సో ఇది
ఫ్రెండ్స్ అనవసరమైన మాటలు వద్దు థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment